Washington Telugu Samithi (WATS) cordially welcomes you to Sri Subhakritu Nama Samvatsara Ugadi Veedukalu on Saturday, 9th APRIL 2022 from 2 PM to 8 PM at Everett Civic Auditorium, 2415 COLBY AVE, EVERETT, WA 98201.
Event: UGADI celebrations
Where: Everett Civic Auditorium, 2415 COLBY AVE, EVERETT, WA 98201
When: 9th APRIL 2022 from 2 PM to 8 PM PST
We are very excited to showcase our local talent, especially portraying our culture, traditions, and festivals. We are seeking cultural registrations for the event.
It's FREE admission(Includes Dinner) for all WATS Life and valid annual members. Please plan to join along with your family and friends for this beautiful event. We request all to register online to help us with better planning.
ప్రియాతి ప్రియమైన తెలుగు బంధువులకి, మిత్రులకు, మరియు శ్రేయోభిలాషులకు వందనములు!
మన తెలుగువారి నూతన సంవత్సరాది సందర్భంగా " వాషింగ్టన్ తెలుగు సమితి - 2022 లో జరుప శుభకృతు నామ సంవత్సర ఉగాది వేడుకలకు మీకు ఇదియే మా ఆహ్వానము! ఉగాది పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తో ఈ నూతన సంవత్సరం ఆరంభమవుతుంది .
ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యం లోకి వచ్చిందని మరొక గాథ."ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.